గుమ్మడిదల: 70 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

863చూసినవారు
గుమ్మడిదల: 70 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
గుమ్మడిదల మండలంలోని మంబాపూర్, నల్లవల్లి, కొత్తపల్లి, నాగిరెడ్డిగూడెం, అనంతారం, కానుకుంట గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద మంజూరైన 70 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం తమ లక్ష్యమని, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన తెలిపారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్