గుమ్మడిదల మండలం బొంతపల్లి లోని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలు ఈనెల 19 నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు దేవాలయ కమిటీ చైర్మన్ ప్రతాపరెడ్డి తెలిపారు. దేవాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బ్రహ్మోత్సవాలు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఆర్య కమిటీ డైరెక్టర్లు యాదగిరి గౌడ్, వీరస్వామి, ఆశా, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.