సంగారెడ్డి జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నట్లు టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి తెలిపారు. బుధవారం ఆర్సీపురంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మరియు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహను కోరినట్లు వెల్లడించారు. గతంలో జిల్లా వ్యాప్తంగా ఉచిత వైద్య, రక్తదాన శిబిరాలు నిర్వహించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.