బిఆర్ఎస్ లో చేరిన భానూరు కాంగ్రెస్ కీలక నాయకులు

1చూసినవారు
బిఆర్ఎస్ లో చేరిన భానూరు కాంగ్రెస్ కీలక నాయకులు
శనివారం సాయంత్రం హైదరాబాద్ లో, పటాన్చెరు మండలం భానూరు గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ వార్డు సభ్యులు ప్రవళిక నరేందర్, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సాగర్, యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కుమ్మరి శివయ్యలు తమ అనుచరులతో కలిసి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ విధానాలు నచ్చకనే తాము బీఆర్ఎస్ లో చేరుతున్నామని వారు తెలిపారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుందని హరీష్ రావు గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్