సంగారెడ్డి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో వీక్షించారు. మెదక్ పార్లమెంట్ కన్వీనర్ రమేష్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నెల్లూరు నుంచి ప్రత్యక్ష ప్రసారం అవుతున్న మహానాడును కార్యకర్తలతో కలిసి వీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.