జిన్నారం: విద్యార్థి కలను సహకారం చేయనున్న మైత్రి ఫౌండేషన్

83చూసినవారు
జిన్నారం: విద్యార్థి కలను సహకారం చేయనున్న మైత్రి ఫౌండేషన్
జిన్నారం మండల కేంద్రానికి చెందిన అతినారం దేవిక ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసిన తరువాత డైట్ సెట్‌కు సిద్ధమవ్వాలనే లక్ష్యంతో ముందడుగు వేసింది. ఈ నేపధ్యంలో ఆమె మైత్రి ఫౌండేషన్ చైర్మన్ ఉదయకుమార్‌ను సంప్రదించింది. విద్య అభ్యాసంలో ఉన్నతస్థాయిలో ప్రగతి సాధించాలనే అభిలాషను గమనించిన చైర్మన్ మైత్రి ఫౌండేషన్ ద్వారా డైట్ సెట్ కు అవసరమైన పుస్తకాలను సోమవారం అందజేశారు.

సంబంధిత పోస్ట్