కాలుష్య పరిశ్రమలను మూసివేయాలని కోరుతూ జిన్నారం మండలం దోమడుగు గ్రామస్తులు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా, పొలిటికల్ జేఏసీ జిల్లా చైర్మన్ అశోక్ కుమార్ మాట్లాడుతూ, పరిశ్రమపై నివేదికలు కాకుండా వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గ్రామస్తులు పిసిబి అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.