సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ ఆల్విన్ కాలనీ భ్రమరాంబ కేతకి రేణుక ఎల్లమ్మ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవానికి పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు ఎమ్మెల్యేను గజమాలతో సన్మానించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు ఎమ్మెల్యే దంపతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, యాదగిరి యాదవ్, భక్తులు తదితరులు ఉన్నారు.