రైతన్నల సంక్షేమం ప్రాధాన్యతగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. బుధవారం శంకరంపేట, గవలపల్లి గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మెదక్ ఆర్డీవో రమాదేవి, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగి 2024-25 వరి పంట కోనుగోలు నిమిత్తం ధాన్యము కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.