యూరో కిడ్స్ పాఠశాలలో 'నేషనల్ డాక్టర్స్ డే' వేడుకలు

0చూసినవారు
యూరో కిడ్స్ పాఠశాలలో 'నేషనల్ డాక్టర్స్ డే' వేడుకలు
పటాన్‌చెరు పట్టణంలోని యూరో కిడ్స్ పాఠశాలలో 'నేషనల్ డాక్టర్స్ డే' వేడుకలను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర యూత్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యరెడ్డి అతిథిగా విచ్చేశారు. సమాజంలో వైద్యులకు అత్యున్నతమైన స్థానం ఉందనీ, కష్టకాలంలో ప్రాణాలు నిలిపే డాక్టర్లు ప్రత్యక్ష దైవాలనీ, ప్రతి విద్యార్థి చిన్నతనం నుంచే వైద్యుల సేవలను, వారి విలువలను గౌరవించడం అలవాటు చేసుకోవాలనీ అన్నారు. చిన్నారులతో కలిసి ఆయన ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.