
వందే భారత్ స్లీపర్ రైళ్లు జనవరిలోనే: రైల్వే శాఖ
కొత్త ఏడాది జనవరిలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. భారతీయ రైల్వే ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే ట్రయల్ రన్స్ పూర్తయ్యాయి. కొన్ని మార్పులు చేసి త్వరలోనే పట్టాలెక్కించనున్నారు. నాన్ ఏసీ ప్రయాణికుల కోసం అమృత్ భారత్ రైళ్లు, ఏసీ ప్రయాణికుల కోసం వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెడుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 164 వందే భారత్ సర్వీసులు నడుస్తున్నాయని, ఈ ఏడాది 42 కొత్త ప్రాజెక్టులను మోదీ జాతికి అంకితం చేశారని వివరించింది.




