సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం తెల్లాపూర్ పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో రెవిన్యూ ఆస్థి పన్నుల వసూళ్ల పై అత్యవసర సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. 2024-25 ఆర్ధిక సంవత్సరమునకు ఇప్పటి వరకు 62. 70 శాతం మాత్రమే వసూలు ఐనదని, ఈ ఆర్ధిక సంవత్సరం ముగింపుకు కేవలం 17 రోజులు మాత్రమే మిగిలి ఉందని 100% వసూళ్లుకు తీసుకున్న చర్యల గురుంచి కమిషనర్ చర్చించారు.