సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారం రాత్రి ప్రశాంతంగా ముగిసింది. ఎంపీడీఓ మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, సర్పంచ్ స్థానాలకు మొత్తం 154 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ప్రక్రియ బుధవారం ఉదయం వరకు కొనసాగింది. ఎన్నికల అధికారులు నామినేషన్లను పరిశీలించి, తుది జాబితాను విడుదల చేస్తారు.