గ్రామాలు, పట్టణాల అభివృద్ధిపనుల్లో భాగస్వామ్యం మరింత పెరగాలి

2చూసినవారు
గ్రామాలు, పట్టణాల అభివృద్ధిపనుల్లో భాగస్వామ్యం మరింత పెరగాలి
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గురువారం గుమ్మడిదల మున్సిపల్ కార్యాలయంలో హెట్రో పరిశ్రమ సౌజన్యంతో 80 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న అదనపు అంతస్తులు, పశువుల ఆసుపత్రిలో న్యూ ల్యాండ్ పరిశ్రమ సహకారంతో 33 లక్షల రూపాయలు నిర్మించి తలపెట్టిన అదనపు గదుల నిర్మాణ పనులను ప్రారంభించారు. పరిపాలన సౌలభ్యం కోసం, ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు. పరిశ్రమల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు.