వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి జలమండలి అధికారులను ఆదేశించారు. పటాన్ చెరు క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎక్కడైనా బోర్లు మరమ్మతులకు గురైతే వెంటనే వాటిని బాగుచేయాలని సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించారు.