ఆదివారం జెపి కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ చౌరస్తాలో సొంత నిధులతో 12 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహ ఏర్పాటు కోసం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశభక్తి, ధైర్యసాహసాలు, స్వరాజ్య స్థాపనకు ప్రతీకగా నిలిచిన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆదర్శాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. నేటి తరం యువత ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన సూచించారు.