పటాన్ చెరు: అభివృద్దిలో పరిశ్రమల భాగస్వామ్యం పెరగాలి

12చూసినవారు
పటాన్ చెరు: అభివృద్దిలో పరిశ్రమల భాగస్వామ్యం పెరగాలి
గ్రామాల అభివృద్దిలో పరిశ్రమల భాగస్వామ్యం మరింత పెరగాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి గ్రామంలో శాండ్వీక్ పరిశ్రమ కోటి రూపాయల సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉపేందర్, మున్సిపల్ కమిషనర్ అజయ్ రెడ్డి, పరిశ్రమ సీఎస్ఆర్ హెడ్ రవి వర్మ తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమల సామాజిక బాధ్యత నిధులతో గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్