పటాన్ చెరులో మంగళవారం మహావీర్ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీధర్ మాట్లాడుతూ, మహావీరుడిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు. 30 ఏళ్లకే మహావీరుడు కుటుంబాన్ని వదిలి లోక క్షేమం కోసం బయటికి వచ్చారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల సమితి సభ్యులు పాల్గొన్నారు.