పటాన్ చెరు: పోలియో చుక్కలను ప్రారంభించిన ఎమ్మెల్యే

606చూసినవారు
పటాన్ చెరు: పోలియో చుక్కలను ప్రారంభించిన ఎమ్మెల్యే
పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిహెచ్ఎంసి కార్యాలయం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని, ఐదు సంవత్సరాల లోపు ఉన్న చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలియో రహిత దేశంగా మార్చడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు బిక్షపతి, పృథ్వీరాజ్, అశోక్, వెంకటేష్, షకీల్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్