తెలంగాణలో
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభకు ప్రభుత్వం అనుమతి ఎందుకు నిరాకరించిందని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,
కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువని చెప్పుకునే ముఖ్యమంత్రి, పక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం సభకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని నిలదీశారు. ఈ చర్య ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు.