గుమ్మడిదల మున్సిపాలిటీ మంబాపూర్ గ్రామంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే పీర్ల పండుగ జాతర పోస్టర్‌ను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆవిష్కరించారు. మంగళవారం సి జి ఆర్ ట్రస్ట్ కార్యాలయంలో గ్రామస్తులు, నిర్వాహకులు అయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 17, 18, 19 తేదీలలో పీర్ల పండుగ జాతర నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కంజర్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.