సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు నియోజకవర్గం, బొల్లారం డివిజన్‌లో శ్రీ పోచమ్మ నల్ల పోచమ్మ ఆలయ విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖశాంతులతో, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో కొలను బాల్‌రెడ్డి, కుమార్ గౌడ్, జగన్నాథ్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.