శనివారం దోమడుగు గ్రామంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో కాలుష్యకారక పరిశ్రమలను మూసివేయాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జేఏసీ చైర్మన్ అశోక్ కుమార్ మాట్లాడుతూ, కాలుష్యకారక పరిశ్రమలను మూసివేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని తెలిపారు. ఈ ర్యాలీలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.