సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు నియోజకవర్గం, తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని
కేసీఆర్ నగర్‌లో ఆదివారం పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించారు. 0 నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి వారి ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టారు. కాలనీవాసులు తమ చిన్నారులను పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి చుక్కలు వేయించాలని, ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందించడం ద్వారా పోలియో రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సిబ్బంది కోరారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.