పటాన్ చెరు కాలనీలో సమస్యలు పరిష్కారానికి చర్యలు

58చూసినవారు
పటాన్ చెరు కాలనీలో సమస్యలు పరిష్కారానికి చర్యలు
పటాన్ చెరు డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో మంగళవారం కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ జిహెచ్ఎంసి సిబ్బందితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక కాలనీవాసులతో ముఖాముఖి మాట్లాడి కాలనీలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో పలు చోట్ల రోడ్లపై చెత్త పేరుకుపోయిందని, పిచ్చి మొక్కలు పెరిగాయని తెలిపారు. అధికారులకు ఫోన్ చేసి పేరుకుపోయిన చెత్తను తొలగించాలని కార్పొరేటర్ సూచించారు.