సంగారెడ్డి: డంపింగ్ యార్డ్ పై పోరాటం ఆగదు

58చూసినవారు
సంగారెడ్డి: డంపింగ్ యార్డ్ పై పోరాటం ఆగదు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ప్యారా నగర్ డంపుయార్డ్ కు వ్యతిరేకంగా 70వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం గుమ్మడిదల మున్సిపాలిటీ అనంతారం యాదవ సంఘం సభ్యులు నిరసన దీక్షలో కూర్చున్నారు. నల్లవల్లి గ్రామ పరిధిలోని ప్యారా నగర్ లో డంపింగ్ యార్డ్ వద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డంప్ యార్డ్ రద్దు చేసే వరకు పోరాటం ఆగదంటూ జేసి నాయకులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్