Apr 06, 2026, 10:04 IST/
ప్రభుత్వ బడుల్లో కూడా ఇక యూకేజీ తరగతులు
Apr 06, 2026, 10:04 IST
TG: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్యను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి మరో 2,700 నుంచి 3,000 పాఠశాలల్లో యూకేజీ తరగతులను ప్రారంభించనుంది. ఇప్పటికే 1000 పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్య ప్రారంభమైంది. ఈ విస్తరణతో దాదాపు 6 వేల మందికి తాత్కాలిక ఉద్యోగాలు లభించనున్నాయి. ఆయాలకు నెలకు రూ.6 వేలు, ఇన్స్ట్రక్టర్లకు రూ.8 వేలు గౌరవ వేతనం అందించనున్నారు.