సంగారెడ్డి: లోక్ అదాలత్‌లో 4,868 కేసుల పరిష్కారం

1చూసినవారు
సంగారెడ్డి: లోక్ అదాలత్‌లో 4,868 కేసుల పరిష్కారం
సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన లోక్-అదాలత్‌కు అపూర్వ స్పందన లభించిందని, మొత్తం 4,868 కేసులు పరిష్కారమైనట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ముఖ్యంగా సైబర్ నేరాలకు సంబంధించి 73 కేసుల్లో రూ. 1.32 కోట్లు, ఎఫ్ఐఆర్ లేని మరో 88 కేసుల్లో రూ. 10.83 లక్షలను బాధితులకు తిరిగి ఇప్పించేందుకు కోర్టు అనుమతి పొందినట్లు వెల్లడించారు. బాధితులకు సత్వర న్యాయం అందించడంలో లోక్-అదాలత్ వేదికగా నిలిచిందని అన్నారు.

సంబంధిత పోస్ట్