సంగారెడ్డి మున్సిపాలిటీలో మూడు రోజుల్లో మొత్తం 394 నామినేషన్లు దాఖలయ్యాయని కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం తెలిపారు. చివరి రోజున ఒక్కరోజే 232 నామినేషన్లు సమర్పించబడ్డాయని ఆయన పేర్కొన్నారు. శనివారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.