సంగారెడ్డి జిల్లాలోని 25 పీఎంశ్రీ పాఠశాలలకు రూ. 7.50 లక్షల నిధులు విడుదలయ్యాయని జిల్లా విద్యాధికారి రోహిణి తెలిపారు. ఒక్కో పాఠశాలకు రూ. 30 వేల చొప్పున ఈ నిధులు కేటాయించారు. ఈ నిధులతో మూడు నెలల పాటు బాలికలకు కరాటే శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈ నిధులు నేరుగా పీఎం శ్రీ పాఠశాల ఖాతాల్లో జమ అవుతాయని ఆమె పేర్కొన్నారు.