సంగారెడ్డి పట్టణంలో బుధవారం రాత్రి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో జ్వాలా తోరణం మహోత్సవ కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. పోతిరెడ్డి పల్లి చౌరస్తాలోని సంగమేశ్వర స్వామి దేవాలయం, ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాసి విద్యాపీఠంలో ఈ కార్యక్రమం జరిగింది. భక్తులు ఉత్సాహంగా మూడుసార్లు జ్వాలాతోరణం కింద నుంచి నడుచుకుంటూ వెళ్లారు. ఈ మహోత్సవం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని జరిగింది.