
70 ఏళ్లు దాటిన జీవించే పక్షి ఏంటో తెలుసా !
లేసాన్ ఆల్బట్రాస్ జాతికి చెందిన 'విజ్డమ్' అనే పక్షి 70 ఏళ్లు దాటినా ఇంకా జీవించి ఉండటంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పెంపుడు పక్షులలో కాకటూ రకం చిలుకలు 80 ఏళ్లకు పైగా, మకావ్, ఆండీయన్ కాండర్ వంటి పెద్ద పక్షులు 60 నుంచి 70 ఏళ్ల వరకు జీవించగలవు. ఈ నేపథ్యంలో, ప్రపంచంలో అత్యధిక కాలం జీవించే పక్షిగా ఆల్బట్రాస్ రికార్డు సృష్టించింది.




