సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కుప్పానగర్ -మచునూర్ శివారులో మంగళవారం కూరగాయలు కొనుగోలు చేసి జహీరాబాద్ నుండి తిరిగి వస్తున్న ఇద్దరు మహిళలు ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సంగమ్మ, బాలమ్మ అనే ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, 108 సిబ్బంది వెంటనే స్పందించి గాయపడిన వారిని జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంగమ్మకు కాలు విరగగా, మరో మహిళకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.