ఈశ్వరాపురం దుర్గామాతను దర్శించిన బల్దిపురం అప్ప

3చూసినవారు
ఈశ్వరాపురం దుర్గామాతను దర్శించిన బల్దిపురం అప్ప
సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట లోని అతి ప్రసిద్ధమైన సప్త ప్రకార యుత శ్రీ దుర్గాభవాని తల్లిని బర్దిపూర్ అప్ప దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా సర్పంచ్ బక్క మంజుల బలరాం ఆధ్వర్యంలో భజనలు చేస్తూ బర్దిపూర్ అప్పకి ఘనంగా స్వాగతం పలికారు. దుర్గా భవాని మాత ఆలయంలో అమ్మ వారిని దర్శించుకుని పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీధర్, పంచాయతీ కార్యదర్శి సునీత, ఆలయ కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్