సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని వైయస్సార్ భవన్‌లో, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా సీనియర్
కాంగ్రెస్ నాయకుడు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పి. ప్రభుగౌడ్ వైయస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి బుధవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైయస్సార్ ముఖ్యమంత్రిగా అమలు చేసిన ఉచిత కరెంట్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్‌మెంట్, 108 వంటి పథకాలను, అలాగే సంగారెడ్డి జిల్లాకు ఐఐటీ, సింగూరు జలాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయం వంటి అభివృద్ధి పనులను ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు కూడా పాల్గొన్నారు.