జిల్లాలో ఈనెల 17 నుంచి 30వ తేదీ వరకు రైతులకు భూభారతి అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పారు. రైతులకు ఎలాంటి సందేహాలు ఉన్న నివృత్తి చేయాలని సూచించారు.