ఆర్టీసీ ఎన్నికల్లో TJMU విజయానికి పిలుపు

2చూసినవారు
ఆర్టీసీ ఎన్నికల్లో TJMU విజయానికి పిలుపు
సంగారెడ్డి ఆర్టీసీ డిపోలో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికల నేపథ్యంలో TJMU (తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్) సంఘం విజయానికి కృషి చేయాలని బుధవారం నాయకులు, కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నిర్మలా జగ్గారెడ్డి కార్మికుల సమస్యలు, సంఘం ఎన్నికలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో TJMU రాష్ట్ర నాయకులు హనుమంతు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ కూన వనిత సంతోష్, వైస్ చైర్మన్ షఫీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్