సంగారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పట్టణ అధ్యక్షులు జార్జి పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, మున్సిపాలిటీ అభివృద్ధికి జగ్గారెడ్డి రూ. 32.10 కోట్ల నిధులు మంజూరు చేయించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు.