మగ్దూంపల్లిలో ఎస్‌ఐఆర్ నోటీసుల పరిష్కారానికి కాంగ్రెస్ నేత రసూల్ పటేల్ సహాయం

1096చూసినవారు
మగ్దూంపల్లిలో ఎస్‌ఐఆర్ నోటీసుల పరిష్కారానికి కాంగ్రెస్ నేత రసూల్ పటేల్ సహాయం
మునిపల్లి మండలం మగ్దూంపల్లి గ్రామంలో మంగళవారం ఎస్‌ఐఆర్ నోటీసుల పరిష్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అంజయ్య, జీపీఓ రాజు, పంచాయతీ సెక్రటరీ నర్సింలు, బీఎల్‌ఓ అంగన్‌వాడీ టీచర్ సరళ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మునిపల్లి మండల ఉపఅధ్యక్షుడు రసూల్ పటేల్ గ్రామస్తులకు అవసరమైన పత్రాలు, డాక్యుమెంట్లపై సమాచారం అందించి, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో బీఎల్‌ఏ ఎంపల్లి శ్రీనివాస్, బాయికాడి ఈశ్వరప్ప, వేంపల్లి వీరిశెట్టి, షఫీ ఉద్దీన్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్