ప్రపంచ పెత్తనం చేస్తున్న అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని, అమెరికా సామ్రాజ్యవాదానికి దేశ ప్రధాని మోడీ తలొగ్గారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. సంగారెడ్డిలో జరిగిన సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సమావేశంలో క్యూబాకు జిల్లాలో సంఘీభావంగా సేకరించిన విరాళాలను చుక్క రాములుకు అందజేశారు. క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.