సంగారెడ్డి జిల్లా, కొండాపూర్ మండలం మునిదేవునిపల్లిలోని నేషనల్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు నిర్వహిస్తున్న వృత్తి విద్యా ఫైనల్ టీచింగ్ ప్రాక్టీస్ లో భాగంగా, స్థానిక పోతిరెడ్డిపల్లి పాఠశాలలో జరిగిన బోధనాభ్యసన కార్యక్రమాన్ని బుధవారం జిల్లా డీఈఓ రోహిణి, ఎంఈఓ పరిశీలించారు. నేషనల్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ సాల్మన్ సార్ తెలిపిన వివరాల ప్రకారం, డీఈఓ విద్యార్థులకు ప్రశ్నలు అడిగి సందేహాలను నివృత్తి చేశారు. నాణ్యమైన విద్య అందించడానికి అభ్యర్థులకు వృత్తి పూర్వక శిక్షణ తప్పనిసరి అని డీఈఓ రోహిణి పేర్కొన్నారు.