సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని 172, 182, 187 పోలింగ్ బూత్‌లలో జరుగుతున్న ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని దేశ్ పాండే గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ స్థాయిలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను సమీక్షించి, సంబంధిత అధికారులకు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, సూపర్వైజర్ శ్రీకాంత్, టౌన్ EPIC ఇన్‌చార్జ్ శివానంద్, పలువురు BLOలు, ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు.