నిర్మలా జగ్గారెడ్డి చేతుల మీదుగా సంగారెడ్డిలో కోటి 75 లక్షల అభివృద్ధి పనుల ప్రారంభం

3చూసినవారు
తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు ఈ రోజు (2026-01-10) సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. సంగారెడ్డి పట్టణంలోని వివిధ కాలనీలలో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, డంబార్ రోడ్లు, బైపాస్ రోడ్లు, రాజీవ్ పార్క్ ముందు సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, మురికి కాలువ పనులు వంటి మొత్తం 1 కోటి 75 లక్షల రూపాయల విలువైన పనులను ఆమె ప్రారంభించారు. ఈ పనుల ద్వారా పట్టణ మౌలిక సదుపాయాలు మెరుగుపడనున్నాయి.

ట్యాగ్స్ :