మునిపల్లి PHC ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..!

1776చూసినవారు
మునిపల్లి PHC ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..!
మునిపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందుల నిల్వలు, లేబర్ రూమ్ నిర్వహణ, రోగులకు అందించే వసతులను అడిగి తెలుసుకున్నారు. పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించారు. PHC పనితీరు పై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి సంధ్యారాణి, గ్రామ సర్పంచ్ సౌందర్య - నరేందర్ గౌడ్, స్టాఫ్ నర్స్ లక్ష్మి, తులసి MLHP ప్రశాంత్, LT సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్