సంగారెడ్డి జిల్లా లోని జోగిపేట&చౌటకూర్ మండలాల 108 అంబులెన్స్ లను గురువారం సాయంత్రం జిల్లా 108 మేనేజర్ మెరుగు నరేష్ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ లో అంబులెన్స్ లలోని మెడిసిన్, రికార్డ్స్, ఆక్సిజన్ నిల్వలు, వైద్య పరికరాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జోగిపేట, చౌటకూర్108 అంబులెన్స్ ల సిబ్బంది పాల్గొన్నారు.