సంగారెడ్డి పట్టణంలోని కలెక్టరేట్ వెనుక పార్కులో కుక్కల బెడదతో వాకర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వందలాది మంది వాకింగ్‌కు వస్తుండగా, గుంపులుగా తిరిగే కుక్కలు వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం కుక్కలు ఇద్దరిని తీవ్రంగా గాయపరిచినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కల బెడదను అరికట్టాలని స్థానికులు మంగళవారం కోరుతున్నారు.