కొత్త సంవత్సరం సందర్భంగా, ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రజలను అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ లింక్‌లను తెరవద్దని హెచ్చరించారు. వాట్సాప్ గ్రూపులలో వచ్చే న్యూ ఇయర్ లింకులపై అప్రమత్తంగా ఉండాలని, కలర్‌ఫుల్ గ్రీటింగ్స్ పేరుతో వచ్చే మార్వెల్ లింకుల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేయాలని తెలిపారు.