సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రాన్స్‌జెండర్ల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని గురువారం అదనపు కలెక్టర్ పాండు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ట్రాన్స్‌జెండర్ల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని, అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండ్ డాక్టర్ మురళీకృష్ణ కూడా పాల్గొన్నారు.