సదాశివపేటలో ఏక్తా దివస్ ర్యాలీ

4చూసినవారు
శుక్రవారం సదాశివపేట పట్టణంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏక్తా దివస్ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ వద్ద సీఐ వెంకటేశం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించగా, అది గాంధీ చౌక్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సీఐ వెంకటేశం మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :