వేసవిలో గ్రామాల్లో త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా శుక్రవారం సూచించారు. సంగారెడ్డి నుంచి డిఎల్పీవో లు, కార్యదర్శులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మంచినీటి సమస్య ఎక్కడ ఉన్న వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని పేర్కొన్నారు.